Monday, September 29, 2025

 అర విరిసిన ఏకాంతంలో...

అల్లుకున్న కౌగిలిలో...

మాటల మల్లెలు జల్లుతూ

మనసుల మమతలు పంచాలని నేనూ....

మౌనపు తెరలు పరుస్తూ

సాంగత్యపు మధువులు జుఱ్ఱాలని నువ్వూ...

ఎన్ని  ఆషాడాలు  దాటినా...

ఎన్నెన్ని వసంతాలు గడచినా...

పోటీ పడుతూనే ఉంటాము.

No comments:

Post a Comment